News October 6, 2024
VZM: మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులను ఆహ్వానించేందుకు 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ఘన స్వాగతం లభించింది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, పార్టీ నాయకులు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
Similar News
News December 6, 2025
విజయనగరం: పెన్షన్ దారులకు అలర్ట్.!

జిల్లాలో కుటుంబ పెన్షన్ దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి నాగ మహేశ్ శనివారం తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026కి చెల్లవని, ఇప్పటికే సమర్పించినవారు మళ్లీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఖజానా కార్యాలయాల్లో సర్టిఫికెట్లు సమర్పించవచ్చని తెలిపారు.

రామేశ్వరంలో రోడ్డు ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి

రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దైవదర్శనం కోసం వెళ్లిన భక్తులు ఈ పరిస్థితుల్లో మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం వారి వెంట ఉంటుందని పేర్కొన్నారు.