News March 14, 2025

VZM: మఫ్టీలో రంగంలోకి దిగిన శక్తి టీమ్స్

image

విజయనగరం జిల్లాలో నూతనంగా ఏర్పడిన శక్తి టీమ్స్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లు, కళాశాలలను శుక్రవారం సందర్శించారు. మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించారు. మఫ్టీలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, యాప్ పనితీరు పట్ల అవగాహన కల్పించారు. మహిళలతో యాప్ డౌన్‌లోడ్ చేయించారు.

Similar News

News January 10, 2026

VZM: సంక్రాంతి సందడి.. కిక్కిరిసిన బస్సులు

image

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూలి పనుల నిమిత్తం వెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా VZM – VSKP రూట్లో రద్దీ ఎక్కువగా ఉంది. పండగ సందర్భంగా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

News January 10, 2026

VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

image

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.

News January 9, 2026

100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాలను నిర్దేశిత గడువులో 100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓడీఎఫ్ డిక్లరేషన్‌లో వెనుకబడి ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గతంలో నీటి సమస్యలు, వ్యాధులు ఉన్న గ్రామాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను శుక్రవారం కోరారు.