News February 5, 2025

VZM: మరికొన్ని రోజుల్లో ‘రూట్’ క్లియర్..!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యగా ఉన్న పెదమానాపురం ఫ్లైఓవర్ పనులు ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా నత్తనడకగా సాగిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పనుల వేగం పుంజుకున్నాయి. మరో రెండు నెలల్లో బ్రిడ్జి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. 

Similar News

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News December 5, 2025

కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

image

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.

News December 5, 2025

మంచిర్యాల: సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్

image

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. సర్పంచ్‌గా తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె గ్రామ ప్రజలను కోరారు. ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.