News February 5, 2025

VZM: మరికొన్ని రోజుల్లో ‘రూట్’ క్లియర్..!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యగా ఉన్న పెదమానాపురం ఫ్లైఓవర్ పనులు ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా నత్తనడకగా సాగిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పనుల వేగం పుంజుకున్నాయి. మరో రెండు నెలల్లో బ్రిడ్జి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. 

Similar News

News February 14, 2025

Good News: హోల్‌సేల్ రేట్లు తగ్గాయ్..

image

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.

News February 14, 2025

అకౌంట్లోకి రూ.15,000.. రేపే లాస్ట్

image

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం) అమలు చేస్తోంది. దీనికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలా చేస్తే ఒక నెల జీతం(గరిష్ఠంగా ₹15000) 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలామంది ఉద్యోగులు UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్‌పై ఆసక్తి చూపడం లేదు.

News February 14, 2025

నల్గొండ: MGU ఇంగ్లిష్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్‌గా అరుణ ప్రియ

image

MG యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధ్యాపకురాలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కే.అరుణ ప్రియను ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్‌గా నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు సేవలు అందించనున్న అరుణ ప్రియ ఆంగ్ల భాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.

error: Content is protected !!