News August 11, 2024
VZM: మళ్లీ తెరపైకి VMRDA ప్రణాళికలు

VMRDA ప్రణాళిక మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం జిల్లాలో VMRDA పరిధిలో రహదారి విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కూటమి ప్రభుత్వంలో విశాఖ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. భూ వినియోగ నిష్పత్తి ఆధారంగా కొత్త తరహా ప్రాజెక్టులతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఆర్థిక, వర్తక, వాణిజ్య, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి భోగాపురాన్ని ప్రతిపాదించారు.
Similar News
News April 17, 2026
VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.

జలధారతో భూగర్భ జలమట్టం పెంచాలి: కలెక్టర్

విజయనగరం జిల్లాలో జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం వర్చువల్‌గా మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 215 ప్రాధాన్యత గ్రామాల్లోని 1,679 చెరువులకు అంచనాలు సిద్ధం చేసి పంపాలని, జిల్లాలోని 8,010 చెరువులకు పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పనులను ఉపాధి హామీ పథకం కింద నమోదు చేయాలన్నారు.