News December 29, 2024

VZM: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే ఈ కుంభమేళాకు ఉమ్మడి విజయనగరం జిల్లా మీదుగా రెండు రైళ్లు నడవనున్నాయి. తిరుపతి-బనారస్-తిరుపతి (కుంభమేళా), నరసాపూర్-బనారస్-నరసాపూర్ (కుంభమేళా) స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News October 14, 2025

విజయనగరం: విధుల్లోకి చేరిన నూతన ఉపాధ్యాయులు

image

డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు విధుల్లో చేరడంతో పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ఈ నియామకాలతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీతో జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్మెంట్లో 578 మంది కొత్త ఉపాధ్యాయలు పోస్టింగ్ పొందారని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. వీరంతా సోమవారం విధులకు హాజరయ్యారు.

News October 14, 2025

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

News October 13, 2025

VZM: ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న కౌన్సిలింగ్

image

ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలలో 91 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 16న ఉ.11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ దేవి మాధవి సోమవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ జాబితాలు http://vizianagaram.nic.in, అందుబాటులో ఉన్నాయన్నారు.