News March 6, 2025
VZM: మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

అప్పటి సతివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతీమణి కనకమ్మ బుధవారం కన్నుముశారు. ఆమె గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పాలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని పాలవలసలోని తన నివాసంలో అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News March 23, 2025
టీబీ రహిత సమాజానికి కృషి చేద్దాం: VZM కలెక్టర్

టీబీ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శనివారం తమ చాంబర్‌లో క్షయ వ్యాధి అవగాహనకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.జీవన రాణి పాల్గొన్నారు.
News March 22, 2025
VZM: జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా SP వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.
News March 22, 2025
VZM: జాగ్రత్త.. తేదీలను చింపేసి మరీ అమ్మకాలు!

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో నివ్వెర పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తును కలిగించే ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. వాటిపై ముద్రించిన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను చించి మరీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.