News May 11, 2024
VZM: మీ నియోజకవర్గంలో విజయం ఎవరిది?

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News October 21, 2025
VZM: ‘పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకోవాలి’

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్మృతి వనంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, ఎస్పీ దామోదర్ పాల్గొని అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.
News October 21, 2025
VZM: రేపటి నుంచి కార్తీకం.. శైవక్షేత్రాలు సిద్ధం

రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు ప్రత్యేక పూజలకు సిద్ధమయ్యాయి.
➤ పుణ్యగిరి ఉమాకోటి లింగేశ్వరస్వామి ఆలయం
➤ సారిపల్లి శ్రీదిబ్బేశ్వరస్వామి ఆలయం
➤ రామతీర్థం ఉమా సదాశివాలయం
➤ కుమిలి శ్రీగణపతి ద్వాదశ దేవాలయం
➤ బొబ్బిలి సోమేశ్వరస్వామి ఆలయం
➤ చీపురుపల్లి భీమేశ్వరస్వామి ఆలయం
ఇవి కాకుండా మీకు తెలిసిన శైవక్షేత్రాలను కామెంట్ చెయ్యండి.
News October 21, 2025
విజయనగరం జిల్లాలో 229 మందికి పదోన్నతులు

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్ సహా 23 కేటగిరీల సిబ్బందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్థానిక డీపీటీఓ కార్యాలయంలో సెలక్షన్ కమిటీ 229 మందిని ఎంపిక చేసే కసరత్తును మొదలుపెట్టింది. ఒకటి, రెండు రోజుల్లో పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు.