News April 25, 2024
VZM: మే 13న వేతనంతో కూడిన సెలవు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్టు జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ దుకాణాలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు దుకాణదారులు, వివిధ సంస్థల యాజమాన్యాలకు ఆదే శాలు జారీ చేశామన్నారు.
Similar News
News January 26, 2025
అక్రమ రవాణాను అడ్డుకున్న గజపతినగరం పోలీసులు
గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో హైవేపై శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 19 పశువులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు తెలిపారు. రెండు లారీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. చిత్ర హింసలకు గురిచేస్తూ పశువులను తరలించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
News January 25, 2025
VZM: అవార్డు అందుకున్న కలెక్టర్ అంబేడ్కర్
ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ డాక్టర్.బీఆర్ అంబేడ్కర్ విజయవాడలో శనివారం అవార్డు స్వీకరించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు స్వీకరించారు.
News January 25, 2025
VZM: కలెక్టరేట్‌లో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు విజయనగరం కలెక్టరేట్‌లో శనివారం జరగనున్నాయి. ఉదయం 10-30 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఘనంగా జరుగుతాయని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు.