News February 2, 2025

VZM: యువకుడి సూసైడ్

image

విజయనగరం యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నాడు. భాస్కరరావు(30) ఫార్మాసిటీలో పనిచేస్తున్నాడు. గాజువాక‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పక్కింటి యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బంధువులు దాడిచేసి అతని తల్లిదండ్రులకు చెప్తామన్నారు. భయపడిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News December 2, 2025

తిరుపతిలో విషాదం.. ఓ ఇంట్లో మూడు మృతదేహాలు

image

తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. ఇవి తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 2, 2025

పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల పరిశీలన

image

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను ముగ్గురు శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. డ్యాం సేఫ్టీ ఎవల్యూషన్లో భాగంగా జలవనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. నీటి నిల్వతో పాటు పలు జాగ్రత్తలపై రిమోట్ ఆపరేటింగ్ వెహికల్‌తో పరిశీలించారు.

News December 2, 2025

ఏపీ వాట్సాప్ గవర్నెన్స్‌కు అత్యధిక హిట్స్

image

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు తొలిసారిగా అత్యధిక హిట్స్ టీటీడీ వల్ల వచ్చింది. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన డిప్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం చూస్తే 1.5 లక్షల మంది భక్తులు తమ పేర్లు ఈ డిప్‌లో వాట్సప్ ద్వారా నమోదు చేసుకున్నారు. ఈ సేవ వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఇన్ని హిట్స్ రావడం ఇదే అత్యధికమని అంటున్నారు.