News August 25, 2024
VZM: యువకుడు అనుమానాస్పద మృతి
కొత్తవలస మండలం కంటకాపల్లి కొత్తూరుకు చెందిన దుక్క రాధాకృష్ణ(18) కంటకాపల్లి జీడీ పిక్కల ఫ్యాక్టరీ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాధాకృష్ణ ఈనెల 9 నుంచి కనిపించట్లేదని తల్లిదండ్రులు తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులకు మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్.ఐ షణ్ముఖరావు సమక్షంలో పోలీసులు విచారణ చేయగా రాధాకృష్ణ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 12, 2024
విజయనగరం: JNTUలో సైబర్ నేరాల నియంత్రణపై సెమినార్
సైబర్ నేరాల నియంత్రణపై విజయనగరం JNTUలో మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ సెమినార్ బుధవారం ప్రారంభం అయింది. సెమినార్‌ను జైపూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పి.అరుణకుమారి ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణకు టెక్నాలజీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్ మోసాలను ఎలా నియంత్రించాలో ఆచరణాత్మక పద్ధతిలో విద్యార్థులకు వివరించారు.
News September 11, 2024
‘పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ రైలు నడపాలి’
పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ ట్రైన్ నడపాలని సీపీఎం బొబ్బిలి పట్టణ కార్యదర్శి పి.శంకర్రావు డిమాండ్ చేశారు. పార్వతీపురం, బొబ్బిలి నుంచి విజయనగరం, విశాఖకు విద్యార్థులు, ఉద్యోగస్థులు, వైద్యం కోసం ప్రతీ రోజూ వేలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారన్నారు. కానీ, సరిపడా ట్రైన్లు లేవన్నారు. ఉన్న ఒకటి రెండు రైళ్లలో కిక్కిరిసి, ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారన్నారు.
News September 11, 2024
విజయనగరం జిల్లాలో పశువుల అక్రమ రవాణా..!
కొత్తవలస మండల కేంద్రంలోని సంతపాలెంలో పశువులను అక్రమంగా నిర్బంధించిన గోడౌన్‌పై సీఐ షణ్ముఖరావు మంగళవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా తరలించేందుకు ఉంచిన 108 పశువులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గొటివాడ ఎర్రిబాబు, గొటివాడ నవీన్, ఐ.దేవుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.