News September 30, 2024

VZM: యువతకు ఎస్పీ కీలక సూచనలు

image

ప్రస్తుతం గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతూ, చట్టాలను కూడా కఠినతరం చేశామన్న విషయాన్ని యువత గమనించాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడుతుందన్నారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా యువత పట్టుబడుతూ.. జైల్లో మగ్గుతున్నారని ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

Similar News

News November 15, 2025

ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి: ఎస్.కోట సీఐ

image

ఎస్.కోట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ (39) వెన్ను, కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు CI నారాయణ మూర్తి తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సెలవుపై ఇంటిలోనే ఉంటున్నాడు. ఈనెల 13న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News November 15, 2025

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు: మంత్రి కొండపల్లి

image

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్‌తో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆరంభించిన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన రావడం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్‌తో పాటు వివిధ రంగాల వారీగా నిపుణులు సమ్మిట్‌లో పాల్గొన్నారన్నారు.

News November 14, 2025

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: ఎస్పీ

image

ఎల్.కోట మండలం రేగలో 2021లో భూతగాదాల వివాదంతో హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తీర్పు ఇచ్చారని SP దామోదర్ తెలిపారు. ఈశ్వరరావు అనే వ్యక్తిని కర్రలతో దాడి చేసి చంపినట్టు నేరం రుజువైనందున విశ్వనాథం, దేముడమ్మ, లక్ష్మిలకు శిక్ష విధించారని వెల్లడించారు. ఏ1గా ఉన్న నిందితుడు అప్పారావు విచారణలో మృతి చెందాడన్నారు.