News February 9, 2025
VZM: యువతకు జిల్లా SP కీలక సూచన

మత్తు, మాదకద్రవ్యాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజ్ఞప్తి చేశారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా, పండించినా చట్టరీత్యా తీవ్ర నేరంగానే పరిగణిస్తామన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. యువతను అప్రమత్తం చేసేందుకు సంకల్ప రథం ద్వారా కృషి చేస్తున్నామని మంచి జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
Similar News
News March 28, 2025
విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం

విజయనగరం రూరల్ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడన్నారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
News March 28, 2025
విజయనగరం: డివిజన్ల పనితీరుపై సమీక్ష

విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీ పోస్టల్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్(DPS) కె.సంతోష్ నేత గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని విజయనగరం,పార్వతీపురం,అనకాపల్లి,శ్రీకాకుళం డివిజన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పొదుపు, ఇన్సూరెన్స్ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సత్కరించారు. సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
News March 28, 2025
విజయనగరం: శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయభద్దంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి కోరారు. ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ అంబేడ్కర్ సూచనల మేరకు ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.