News December 23, 2024
VZM: యువతకు దారి చూపిస్తున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి
విజయనగరంలో నిరుద్యోగ యువతి, యువకులు కోసం గత రెండు సంవత్సరాలుగా అలుపెరుగని సాధనతో రామారావు (రిటైర్డ్ ఆర్మీ) ఉద్యోగి నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇతని దగ్గర శిక్షణ పొందిన వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల్లో కోలువులు తీరారు. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జీడీ ఫలితాలలో మొత్తం 80 విద్యార్థులు ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కోచ్ రామారావుని విద్యార్దులు ఘనంగా సన్మానించారు.
Similar News
News December 24, 2024
బొబ్బిలిలో యాక్సిడెంట్.. చికిత్స పొందతూ మృతి
బొబ్బిలి హైవేపై అదివారం స్కూటీపై ప్రయాణిస్తున్న యువకుడుని లారీ ఢీ కొట్టింది. గుర్ల మండలం గొలగంకి చెందిన నడిమువలస రాంబాబు (26) బొబ్బిలిలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా ప్రాణాలతో పోరాడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 24, 2024
ప్రత్యేక అలంకరణలో పైడితల్లమ్మ
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజామున అమ్మవారికి విశేష అర్చనలు జరిపించి, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
News December 24, 2024
VZM: పవన్ కళ్యాణ్ అభిమాని ఇంట్లో విషాదం`
కొత్తవలస మండలం రామలింగాపురంలో <<14964633>>బ్రైన్ ట్యామర్<<>>తో అఖిర్ నందన్(6) చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడి తండ్రి అప్పలరాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు కలిసేలా అఖిర్ నందన్ అని తన కుమారిడికి పేరు పెట్టుకుని మురిసిపోయాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో చిన్న వయస్సులో తన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.