News August 1, 2024
VZM: యువతిపై హోంగార్డ్ అత్యాచారం.. ఎస్పీ సీరియస్
యువతిపై అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును శాశ్వతంగా విధులు నుంచి తొలగించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోం గార్డుగా పనిచేస్తున్న సురేశ్..ఓ ప్రేమ జంటను బెదిరించి యువతిని నెల్లిమర్లలోని కొండపేటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోంగార్డును అరెస్ట్ చేశారు. నిందితుడికి శిక్షపడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
Similar News
News October 8, 2024
పైడితల్లమ్మ జాతరకు యుద్ధప్రాతిపదికన పనులు
ఈనెల 15న నిర్వహించనున్నట్లు పైడితల్లమ్మ సిరిమాను జాతర మహోత్సవానికి విజయనగరం నగరపాలక సంస్థ తరఫున, అన్ని సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నట్లు కమిషనర్ పి నల్లనయ్య తెలిపారు. రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు, వివిధ రహదారుల మరమ్మతు పనులు, డివైడర్లు, రెయిలింగులకు రంగులు వేస్తున్నట్లు చెప్పారు. వివిధ జంక్షన్లలో విద్యుదీకరణ, అలాగే ప్రాశస్త్య భవనాలకు విద్యుదీకరణ వంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
News October 8, 2024
సచివాలయ ఉద్యోగులను వేధించడం దారుణం: మజ్జి శ్రీనివాసరావు
సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయన్నారు. విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతూ వేధించడం దారుణమన్నారు. ఉద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు.
News October 8, 2024
విజయనగరంలో సుద్దాల అశోక్ తేజ పర్యటన
అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.