News August 27, 2024
VZM: యోగా శిక్షకులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ హోమియో వైద్యశాల రాకోడు లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో యోగా శిక్షకులుగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి డా. పి. సత్యేంద్ర కుమార్ తెలిపారు. యోగా శిక్షకులుగా పనిచేసేవారు ఎమ్మెస్సీ యోగా, పీజీ డిప్లొమో ఇన్ యోగా , డిప్లొమో ఇన్ యోగాలో అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News November 18, 2025
10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
News November 18, 2025
VZM: ‘రైతుల ఖాతాల్లో రూ.150 కోట్లు జమ’

సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు జమ చేయనున్నారని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.150.03 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 (సుఖీభవ రూ.5వేలు, పీఎం కిసాన్ రూ.2వేలు ) చొప్పున జమ అవుతుందని తెలిపారు.
News November 18, 2025
VZM: కలెక్టర్ ఆగ్రహం.. ముగ్గురు సచివాలయ సిబ్బందికి నోటీసులు

రామభద్రపురం సచివాలయాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.


