News February 1, 2025

VZM: రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కోడ్ గురించి రాజకీయ ప్రతినిధులకు వివరించారు. పలు శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News October 24, 2025

మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు వేగవంతం: కలెక్టర్

image

బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న విజయనగరం జిల్లా మత్స్యకారులను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, ఢాకాలోని భారత హైకమిషన్‌తో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

News October 23, 2025

ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదల

image

ఆండ్ర జలాశయంలోకి గురువారం సాయంత్రం ఇన్ ఫ్లో 750 క్యూసెక్కుల వరద నీరు రావడంతో స్పిల్వే రెండో గేట్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని చంపావతి నదిలోకి విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలైన అనంతగిరి, మెంటాడ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీటి మట్టం పెరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 23, 2025

సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లో‌అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.