News August 19, 2024

VZM: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రథమ స్థానం

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గడిచిన 3రోజుల నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు హోరాహోరీగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. రెండు విభాగాల్లోనూ విజయనగరం జిల్లా జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. విజేతలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులను అభినందించారు.

Similar News

News September 19, 2024

మంత్రి లోకేశ్‌తో జిల్లా ప్రజా ప్రతినిధులు భేటీ

image

రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ సమావేశంలో మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, అదితి గజపతి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్సీ చిరంజీవి, తదితరులు నారా లోకేష్ తో భేటీ అయ్యి కాసేపు మాట్లాడారు. నియోజకవర్గాల తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు.

News September 18, 2024

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు

image

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. విమానాశ్రయానికి అల్లూరి పేరును నామకరణం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 18, 2024

ఉమ్మడి జిల్లాలో రేపు రెండు అన్న కాంటీన్లు ప్రారంభం

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్న కాంటీన్లను గురువారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు క్యాంటీన్ల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జీజే కళాశాల పక్కన.. అలాగే బొబ్బిలిలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అన్న కాంటీన్‌లు ప్రారంభం కానున్నాయి.