News February 21, 2025
VZM: రాష్ట్ర స్థాయిలో జిల్లా ర్యాంకులు ఇలా!

ప్రభుత్వ పథకాల అమలు, కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా అందుతున్న సేవలపై ప్రధాన కార్యదర్శి విజయానంద్ ర్యాంకులను విడుదల చేశారు. మద్యం నిర్వహణలో 1వ ర్యాంక్, ఘన వ్యర్ధాల నిర్వహణలో 2వ ర్యాంక్, ఆసుపత్రుల్లో సేవలకు 5వ ర్యాంక్, ఆర్టీసీ బస్ స్టేషన్ల నిర్వహణలో 1వ ర్యాంక్, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో 5వ ర్యాంక్, రేషన్ సరుకుల పంపిణీలో 7వ ర్యాంక్, పింఛన్ల పంపిణీలో 18వ ర్యాంక్, అన్న కాంటీన్‌లకు 25వ ర్యాంక్ లభించాయి.
Similar News
News March 19, 2025
VZM: 23న జరిగే అక్షరాస్యతా పరీక్షకు ఏర్పాట్లు

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ప్రాథమిక అక్షరాస్యతా పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని DRDA PD ఎ.కల్యాణచక్రవర్తి, వయోజన విద్య DD ఎ.సోమేశ్వర్రావు కోరారు. స్థానిక DRDA సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు మధ్య లబ్దిదారులు వారికి వీలైన సమయంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.
News March 18, 2025

భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.