News September 21, 2024

VZM: రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ డీఐజీగా నాగలక్ష్మి

image

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ డీఐజీగా ఎ.నాగలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె కాకినాడ నుంచి విజయనగరం బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజిస్ట్రార్‌గా పని చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని రిజిస్ట్రార్‌గా కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Similar News

News October 17, 2025

దివిస్ కంపెనీలో విషవాయివుల లీక్

image

భీమిలి సమీపంలోని దివిస్‌ లేబరెటరీస్‌లో విషవాయువులు లీక్ అయ్యాయి. శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు టెక్నీషియన్స్ అస్వస్థతకు గురయ్యారు. కార్మికులు వినయ్ కుమార్, హేమంత్‌ని స్థానిక ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అపోలోకి తరలించారు.

News October 16, 2025

లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టాలి: VZM SP

image

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారి భరతం పట్టాలని ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి నేర సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, దర్యాప్తు కేసులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

News October 16, 2025

ఉద్యోగుల కోసం రేపు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం: VZM కలెక్టర్

image

ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని శుక్రవారం నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి గురువారం తెలిపారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా సకాలంలో హాజరు కావాలని కోరారు.