News March 28, 2024

VZM: రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్

image

రామభద్రపురం మండలం కొట్టక్కి బస్ షెల్టర్ సమీపంలో గురువారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులలో ఇద్దరు సాలూరు పట్టణానికి, ఒకరు జన్నివలస గ్రామానికి చెందిన వారు అని స్థానికులు తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 26, 2026

VZM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 508 గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షను 19,436 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 18,928 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 508 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని చెప్పారు.

News February 26, 2026

VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ (M) గుడివాడకు చెందిన గుడివాడ కిషోర్ (19) తన బైక్‌ పై కొట్యాడలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాసాపేట సమీపంలో గల వంతెన వద్ద బైక్ అదుపు తప్పడంతో గెడ్డలో పడి మునిగి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ పాపారావు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 26, 2026

53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.