News October 2, 2024
VZM: రేపటి నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు.. జిల్లాలో ఐదు కేంద్రాలు

రేపటి నుంచి ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు గాను జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పూటలా ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 .30 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 22,889 మంది అభ్యర్ధులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల ఇన్‌ఛార్జ్‌గా ఆర్డీవో దాట్ల కీర్తి వ్యవహరించనున్నారు.
Similar News
News November 19, 2025
VZM: ‘100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సిద్ధం కావాలి’

పదో తరగతిలో ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు డిసెంబర్ 5వ తేదీ లోపు సిలబస్ పూర్తిచేయాలని DEO మాణిక్యం నాయుడు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గత ఏడాది 87% పాస్ రేట్‌తో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం సిలబస్ పూర్తి చేసి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు.
News November 19, 2025
సకాలంలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 19, 2025
డ్రంకన్ డ్రైవ్‌లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.


