News August 17, 2024

VZM: రేపు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కారణంగా రేపు ఉ.6 గంటల నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకు దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు IMA వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైద్యులు నిరసనలతో 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.

Similar News

News October 7, 2024

విజయనగరంలో వాలంటీర్ల నిరసన

image

విజయనగరంలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు సోమవారం ఉదయం నిరసనకు దిగారు. యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాలంటరీల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను కొనసాగించాలని కోరారు.

News October 7, 2024

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

News October 6, 2024

దళారుల బారిన పడి మోసపోవద్దు: VZM కలెక్టర్

image

కేజీబీవీలో ఉద్యోగాలకు కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, దళారులబారిన పడి అభ్యర్థులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న వారి వివరాలు తమకి తెలియజేయాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.