News April 1, 2025

VZM: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి కాలుజారి పడటంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఛత్రిభాను(46) మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. దిబ్రుగర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న రైలులో ప్రయాణం చేస్తున్న భాను విజయనగరం స్టేషన్‌లో వాటర్ కోసం దిగాడు. ఇంతలోనే రైలు కదలండంతో రైలులోకి ఎక్కుతుండగా కాలుజారి కిందపడి మృతి చెందిడని SI తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహారాజు ఆసుపత్రికి తరలించామన్నారు.

Similar News

News September 19, 2025

భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

image

భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యం, జాతీయ ర‌హ‌దారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేక‌ర‌ణ‌పై క‌లెక్ట‌రేట్లో సంబంధిత అధికారుల‌తో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం స‌మీక్షా నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు జిఎంఆర్‌కు అప్ప‌గించిన 2,200 ఎక‌రాల భూముల ప‌రిస్థితి, వాటికి సంబంధించిన స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. విమాన‌యాన అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎక‌రాల భూములపై ఆరా తీశారు.

News September 18, 2025

VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

image

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

News September 18, 2025

పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

image

సంతకవిటి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.