News June 17, 2024

VZM: రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన వ్యక్తి

image

రైలు ప్రమాదంలో కొత్తవలసకి చెందిన గోలజాపు పెంటయ్య(60) రెండు కాళ్లను కోల్పోయారు. బహిర్భూమికి వెళ్లి రైలు పట్టాలు దాటుతుండగా కొత్తవలస రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్-1 చివరలో విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుడికి రెండు కాళ్ళు ఛిద్రమయ్యాయి. వెంటనే 108కి ఫోన్ చేసి క్షతగాత్రుడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు ఆర్పీఫ్ ఎస్సై ఆర్.హసిధ, ఏఎస్ఐ ఎ.ధర్మారావు తెలిపారు.

Similar News

News January 24, 2026

రేపు ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని విజయనగరం కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ముందుగా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ, అనంతరం ఆడిటోరియంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుందన్నారు.

News January 24, 2026

VZM: ‘ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి’

image

ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని DRO మురళి అధికారులను శనివారం ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, థియరీ పరీక్షలకు 39,037 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తామన్నారు. జిరాక్స్ షాపులు మూసివేస్తామని, సెల్‌ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు.

News January 24, 2026

కొత్తవలస రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ రైళ్ల నిలుపుదల

image

అమృత్ భారత్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతున్న కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పలు అమృత్ భారత్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ సీఎమ్ కె. పవన్ కుమార్ తెలిపారు. రైళ్లు (16597/98, 16223/24, 16107/08, 16523/24) ఇకపై ఇక్కడ ఆగనున్నాయన్నారు. ఈ రైళ్లు విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండా విజయనగరం, కొత్తవలస, దువ్వాడ మీదుగా ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు.