News June 2, 2024
VZM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
డెంకాడ మండలం చింతలవలస సమీపంలోని బొడ్డవలస పెట్రోల్ బంక్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. చింతలవలసకు చెందిన శరత్ కుమార్ (26), శివ ప్రసాద్ (25) శనివారం రాత్రి బైక్‌పై భీమిలి నుంచి ఇంటికి వస్తుండగా చింతలవలస పెట్రోల్ బంక్ సమీపంలో ముందున్న వాహనాన్ని ఢీకొన్నారు. స్థానికుల సమాచారంతో శివ ప్రసాద్ తల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారిద్దరూ మృతిచెందారు.
Similar News
News September 16, 2024
ఎస్.కోట: మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం
ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో ఓ వృద్ధుడు ఆదివారం సజీవదహనమయ్యాడు. రాత్రి వినాయక నిమజ్జనంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పెంట నాగు(74) మద్యం తాగి సిగరెట్ వెలిగించాడు. ఈ క్రమంలో సిగరెట్ నిప్పు అంటుకోవడంతో మంచంతో పాటు ఆయన సజీవ దహనమయ్యాడు. ఇంట్లో ఉన్న భార్య కేకలు వేసినా ఫలితం లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 16, 2024
కొత్తవలస: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే
కొత్తవలస టౌన్ వెంకట శివానగర్‌లో ఆదివారం గొలగాని పావని<<14110348>> ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెను నిర్లక్ష్యం చేయడంతో బాధితురాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న భర్త ఆమెను ఈ మధ్య తరచూ వేధించేవాడు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నిర్లక్ష్యంతో ముగ్గురి జీవితాల్లో విషాదం నెలకొంది.
News September 16, 2024
VZM: జాతీయస్థాయిలో జిల్లాకు టైక్వాండో పతకాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు జాతీయ సబ్ జూనియర్ టైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజయనగరానికి చెందిన క్రీడాకారులు 8 మెడల్స్ సాధించారు. కే.సాహిత్య – 1 గోల్డ్ 1 బ్రాంజ్, పీ.పునీత్ – 1 సిల్వర్ 2 బ్రాంజ్, వి. కుషాల్ – 1 సిల్వర్ 1బ్రాంజ్, ఎస్.సాత్విక్ – 1 సిల్వర్ గెలుపొందారు. క్రీడాకారులను రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు.