News April 10, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీచర్ మృతి

image

పద్మానాభంకి చెందిన వి.రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 11 గంటలకు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనిమీద విజయనగరం బైక్‌పై వెళ్తుండగా చిన్నాపురం సమీపంలో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనగా రమణ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన ఎస్.రాయవరం హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు.

Similar News

News April 11, 2026

కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

image

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.

News April 11, 2026

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

image

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.