News June 22, 2024
VZM: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మెంటాడ మం. కొంపంగికి చెందిన త్రినాథ్ కుటుంబంతో తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నాడు. అక్కడే చెప్పుల షాప్లో పనిచేస్తూ భార్య అశ్విని(26), ఇద్దరు పిల్లలను పోషించేవాడు. గజపతినగరంలో సొంతంగా షాప్ పెడదామని కుటుంబంతో వ్యాన్లో బయలుదేరాడు. శుక్రవారం చెల్లూరు వద్ద వ్యాన్ బోల్తా పడగా అశ్విని తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందింది.
Similar News
News October 22, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ప్రీ-ఆడిట్ పెండింగ్ ఫిర్యాదులను రెండు వారాల్లో 20% లోపు తగ్గించాలని, SLA గడువు దాటకూడదని స్పష్టం చేశారు. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే శాతం 10% కంటే ఎక్కువ కాకుండా చూడాలని సూచించారు.
News October 22, 2025
VZM: సీమంతం జరిగిన రెండో రోజే భర్త మృతి

గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన పాపినాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య సీమంతం జరిగి రెండు రోజులు గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం నుంచి తిరిగి వస్తూ మొక్కజొన్న కంకులు ఆరబెట్టిన రోడ్డుపై బైక్ అదుపుతప్పి పడిపోవడంతో బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. గతంలో తండ్రి అప్పలనాయుడు కూడా ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News October 22, 2025
VZM: సొంతం పేరిట దోచేస్తున్నారు.. భవిష్యత్లో ముప్పే..!

జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంతానికి మాత్రమే ఇసుకను పట్టుకువెళ్లవచ్చునని ప్రభుత్వం మంచిగా ఆలోచిస్తే ఆ ముసుగులో అక్రమార్కులు బరి తెగుస్తున్నారు. చిన్న ఆటోలు, ఎడ్ల బళ్లతో ఇసుకను డంప్ చేస్తూ అమ్మేస్తున్నారు. నదుల్లో విచ్చలవిడి తవ్వకాలతో భవిష్యత్ లో ప్రమాదం పొంచి ఉంది. మీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా? కామెంట్ చేయండి.