News April 4, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కురుపాం మండలం కాకిలి గ్రామానికి చెందిన కడ్రక సతీశ్ (30), శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సతీశ్ శ్రీకాకుళం జిల్లా కీసరజోడులో పెళ్లికి బైక్‌పై వెళ్లాడు. చిన్నబగ్గ- కె గుమ్మడ రోడ్డులో తిరిగి వస్తుండగా, పాలకొండ నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.

Similar News

News November 2, 2025

విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.

News November 2, 2025

VZM: బస్సు చక్రాల కింద నలిగిన బతుకు

image

గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు(70) మృతి చెందాడు. మృతుడు తన స్వగ్రామం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించే సమయంలో బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. తల నుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.

News November 2, 2025

విజయనగరం నుంచి పంచారామాలకు

image

కార్తీక మాసం పురష్కరించుకుని పంచారామాలు భక్తులు దర్శించుకోవడానికి విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పంచా రామ పుణ్యక్షేత్రాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆదివారం రెండు సూపర్‌ లగ్జరీ బస్సులు బయలుదేరాయన్నారు. వచ్చే వారం వెళ్లాలనుకునేవారు సిబ్బందిని సంప్రదించాలని కోరారు.