News September 24, 2024

VZM: వందే‌భారత్ టికెట్ రేట్లపై మీ కామెంట్

image

విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడుస్తున్న వందేభారత్ టికెట్ ధరలపై ప్రయాణీకులు పెదవి విరుస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరానికి రూ.435, పార్వతీపురం-రూ.565, రాయగడ- రూ.640, రాయ్‌పూర్‌-రూ.1435, దుర్గ్‌కు రూ.1495 ఛార్జ్ చేస్తున్నారు. భారీగా ఉన్న ఈ ధరలతో వందే భారత్ ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని విమర్శలొస్తున్నాయి. ధరలు తగ్గించాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. మరి ఈ టికెట్ రేట్లపై మీ కామెంట్

Similar News

News October 11, 2024

సిరిమానోత్సవంపై కలెక్టర్ సమీక్ష

image

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అన్ని సంప్రదాయాలను పాటిస్తూ భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో అమ్మవారి పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అమ్మవారి సిరిమాను వద్ద పని చేసే సిబ్బంది 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ప్రారంభం అయ్యేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 5 గంటలలోగా జాతర పూర్తవ్వాలన్నారు.

News October 11, 2024

VZM: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ‘1912’

image

విజయనగరం జిల్లాలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలనుకునే వారు ఇంటి వద్ద నుండే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ‘1912’ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి రైతు యొక్క ఆధార్, పాస్ బుక్, సర్వే నంబర్, ఫామ్ -3, మొబైల్ నంబర్ వివరాలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు తెలపాలన్నారు.

News October 11, 2024

విజయనగరం ఉత్సవాల్లో ఈవెంట్స్ జరిగే ప్రాంతాలివే..

image

విజయనగరం-2024 ఉత్సవాలను ఆదివారం ఉ.11 గంటలకు అయోధ్య మైదానంలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
వేదికలు: అయోధ్య మైదానం, మహారాజ కోట, గురజాడ కళాక్షేత్రం, విజ్జీ స్టేడియం, రాజీవ్ స్టేడియం, ఆనంద గజపతి కళాక్షేత్రం, ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ క్లబ్, లయన్స్ కమ్యూనిటీ హాల్, బొంకుల దిబ్బ, కోట, మన్సాస్ మైదానం(లోవర్ ట్యాంక్ బండ్ రోడ్).