News June 11, 2024
VZM: వాహన తనిఖీల్లో 188 మందికి ఈ-చలానాలు

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను మంగళవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 188 మందిపై రూ. 44,990 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 17 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
Similar News
News March 19, 2025
గుర్ల: పాము కాటుతో ఇంటర్ విద్యార్ధిని మృతి

పాము కాటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఫకీర్ కిట్టలి పంచాయతీ బూర్లే పేటలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ద్వారపూడి మౌనిక అనే విద్యార్థినికి అర్ధరాత్రి ఇంటివద్దనే నాగుపాము కాటువేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News March 19, 2025
‘భర్త అనుమానించడం వలనే హత్య చేశా’

విశాఖలో ఓ తల్లి కన్న కూతురినే హతమార్చింది. పెద్దగదిలిలో జరిగిన ఈ హత్య కేసులో నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పాప పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా తెలుస్తోంది. భర్త అనుమానంతో బెడ్ రూమ్‌లో కూడా CC కెమెరా పెట్టాడని దీంతో మనస్తాపం చెంది కూతురిని తల దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితురాలు శిరీష పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు ఆరిలోవ CI మల్లేశ్వరరావు తెలిపారు.
News March 19, 2025
జిల్లాలో ఐదు మినుము, పెసలు కొనుగోలు కేంద్రాలు

విజయనగరం జిల్లాలో ఐదు మినుము, పెసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జామి మండలం విజినిగిరి, గంట్యాడ, బొబ్బిలి, గజపతినగరం, సంతకవిటి మండలాల్లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మినుము, పెసలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. అపరాలు ఉన్న రైతులు తమ పేర్ల రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని కోరారు.