News November 9, 2024

VZM: విద్యుత్ భవన్‌లో ఫైర్ సేఫ్టీ పై అవగాహన

image

విజయనగరం జిల్లా స్థానిక దాసన్నపేట విద్యుత్ భవన్‌లో విద్యుత్ అధికారులు, సిబ్బందికి గత మూడు రోజులుగా NPTI బెంగళూరు ఆధ్వర్యంలో భద్రతా విపత్తులు మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఫైర్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలను నివారించే సమయంలో తగు జాగ్రత్తలను వివరించారు.

Similar News

News October 30, 2025

VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

image

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.

News October 29, 2025

VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

image

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News October 29, 2025

విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.