News November 9, 2024
VZM: విద్యుత్ భవన్‌లో ఫైర్ సేఫ్టీ పై అవగాహన
విజయనగరం జిల్లా స్థానిక దాసన్నపేట విద్యుత్ భవన్‌లో విద్యుత్ అధికారులు, సిబ్బందికి గత మూడు రోజులుగా NPTI బెంగళూరు ఆధ్వర్యంలో భద్రతా విపత్తులు మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఫైర్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్ని ప్రమాదాలను నివారించే సమయంలో తగు జాగ్రత్తలను వివరించారు.
Similar News
News December 13, 2024
భోగాపురం: చిట్టీల కేసులో భార్య, భర్త అరెస్ట్
చీటీలు, స్కీములు నిర్వహించి సుమారు రూ.2 కోట్లు వరకు మోసం చేసిన భీమిలి మండలం వలందపేటకు చెందిన భార్యాభర్తలు సరగడపార్వతీ, లక్ష్మణరెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో చీటీలు, రకరకాల స్కీములు నిర్వహించి గ్రామస్థుల నుంచి సుమారు రూ.2 కోట్లు చీటింగ్ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన మజ్జి త్రినాథమ్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
News December 13, 2024
మక్కువ: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మక్కువ మండలంలోని శంబర రహదారి సమీపంలో ఇటుక బట్టి వద్ద పని చేస్తున్న అంజిబాబు విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. యానాదుల వీధికి చెందిన అంజిబాబు గత కొన్ని ఏళ్లుగా ఇటుక బట్టి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఐరన్ పైపులను తాకడంతో వెంటనే షాక్ గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News December 11, 2024
గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.