News May 26, 2024

VZM: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పూసపాటి రేగ మండలంలో శనివారం ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతుడు అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన దారపు రెడ్డి అప్పారావు (48)గా గుర్తించారు. ఇతడు మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పనులు చేస్తుండంగా వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. భోగాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

Similar News

News February 14, 2025

మంత్రి గన్‌మెన్‌ వెంకటరమణను సస్పెండ్ చేసిన ఎస్పీ

image

రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న జి.వెంకటరమణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇటీవల సాలూరు నుంచి విజయనగరం వస్తుండగా బుల్లెట్ మ్యాగ్జైన్‌తో ఉన్న బ్యాగ్ మిస్ అయ్యింది. దీంతో ఆయన విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 14, 2025

విజయనగరంలో మంత్రి గన్ మెన్ బ్యాగ్ మిస్సింగ్

image

విజయనగరంలో మంత్రి సంధ్యారాణి వద్ద గన్ మెన్‌గా పనిచేస్తున్న ఏఆర్ హెచ్సీ వెంకటరమణ బ్యాగ్ మిస్సింగ్ కలకలం రేపింది. బుధవారం రాత్రి కణపాక వెళ్లే రహదారి వద్ద బ్యాగ్‌ను ఆటోలో పెట్టి జిరాక్స్ తీసేందుకు వెళ్లగా తన బ్యాగ్ మిస్ అయినట్లు వన్ టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో బుల్లెట్ మ్యాగ్జై‌న్, 30 బుల్లెట్లు మిస్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. CI శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.

News February 14, 2025

VZM: స్వీట్ షాప్‌లో కుప్పకూలి మృతి

image

తగరపువలసలోని ఓ స్వీట్‌షాప్‌లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్‌లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్‌కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!