News March 18, 2025

VZM: విన‌తుల‌ను పరిష్క‌రించి తెలుగులోనే సమాచారం ఇవ్వాలి

image

ప్ర‌జా విన‌తుల ప‌రిష్కార వేదిక‌లో వివిధ వ‌ర్గాలు ఇచ్చే విన‌తుల‌ను పరిష్క‌రించిన అనంత‌రం తెలుగులో వారికి అర్ధ‌మ‌య్యే రీతిలో సమాచారం ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేడ్కర్ ఆయా డివిజన్‌ల అధికారులను ఆదేశించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. వ‌చ్చిన ప్ర‌తి విన‌తిని పరిష్క‌రించిన త‌ర్వాత ఆయా విన‌తులు అందించిన వారితో మాట్లాడి వారు ఇచ్చిన విన‌తులను పరిష్కరించాలన్నారు.

Similar News

News April 24, 2025

రామభద్రపురం : పరీక్షా ఫలితాలు వెలువడకముందే విద్యార్థి సూసైడ్

image

రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన కర్రి దుర్గాప్రసాద్ (15) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయంతో ముందే ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు సాలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా నిన్న వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.

News April 24, 2025

VZM: ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు

image

జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.

News April 24, 2025

బాలికను రక్షించిన కానిస్టేబుల్‌కు ప్రశంసా పత్రం

image

విజయనగరం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంట్లో అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు వచ్చింది. టూ టౌన్ కానిస్టేబుల్ ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి 17 ఏళ్ల అమ్మాయిని రక్షించారు. దీంతో ఎస్పీ వకుల్ జిందాల్ కానిస్టేబుల్‌ని బుధవారం అభినందించి, ప్రశంసా పత్రం అందజేశారు.

error: Content is protected !!