News March 30, 2024
VZM: ‘వేసవిలో పశువులను సంరక్షించాలి’

వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పశువులను సంరక్షించాల్సిన బాధ్యత రైతులదేనని గుమ్మలక్ష్మీపురం పశు వైద్య అధికారి పి. లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం రాయగడ జమ్ము గ్రామంలో పశు సంవర్ధక శాఖ, జట్టు సంస్థ సంయుక్తంగా పశు వైద్య శిభిరం నిర్వహించారు. సుమారు 380 పశువులకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో జట్టు సంస్థ కో ఆర్డినేటర్లు జి. ప్రభోద్, జి.మురళి తదితరులు ఉన్నారు.
Similar News
News February 25, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు

పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు హాజరై ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
News February 25, 2026
VZM: ‘పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

విజయనగరం జిల్లాలో రీసర్వే, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా 100% పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో జరిగిన వీసీ అనంతరం ఆయన మాట్లాడారు. రీసర్వే గ్రామాల్లో సర్వేయర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు.