News March 30, 2024

VZM: ‘వేసవిలో పశువులను సంరక్షించాలి’

image

వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పశువులను సంరక్షించాల్సిన బాధ్యత రైతులదేనని గుమ్మలక్ష్మీపురం పశు వైద్య అధికారి పి. లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం రాయగడ జమ్ము గ్రామంలో పశు సంవర్ధక శాఖ, జట్టు సంస్థ సంయుక్తంగా పశు వైద్య శిభిరం నిర్వహించారు. సుమారు 380 పశువులకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో జట్టు సంస్థ కో ఆర్డినేటర్లు జి. ప్రభోద్, జి.మురళి తదితరులు ఉన్నారు.

Similar News

News January 23, 2025

ఆనందంగా గడిపారు.. అంతలోనే విషాదం

image

అగనంపూడి టోల్‌గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో <<15230832>>మృతి చెందిన<<>> గొర్లి మన్మథరావు(38), అరుణ కుమారి (32) సంక్రాంతికి పిల్లలతో కలిసి గడిసింగుపురం వచ్చారు. గ్రామంలో ఆనందంగా గడిపిన వారు.. కనుమ మరుసటి రోజే పయనమయ్యారు. ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్న మన్మథరావు బుధవారం సెలవు పెట్టి భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News January 23, 2025

పార్వతీపురం: వలస వెళ్లి విగత జీవులయ్యారు..!

image

బతుకుతెరువుకు ఊరొదిలి వెళ్లిన ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు వెంటాడడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. <<15222234>>అగనంపూడి <<>>టోల్‌గేట్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15225242>>మృతి చెందిన <<>>గొర్లి మన్మథరావు, అరుణకుమారి జి.ఎం వలస(M) గడిసింగుపురం నుంచి రెండేళ్ల క్రితం వలస వచ్చారు. మన్మథరావు ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు నిఖిల్, కూతురు నీలిమ ఉన్నారు.

News January 23, 2025

విజయనగరం జిల్లాలో 5 ఆసుపత్రులు.. 13 ప్రత్యేక వైద్య బృందాలు

image

విజయనగరం జిల్లాలో గురువారం నుంచి దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం జిల్లాలోని ఐదు ఆసుపత్రులు, 13 ప్రత్యేక వైద్య బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. శారీరక దివ్యాంగుల కోసం గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్ కోట, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, అందుల కోసం రాజాం, GGH, ఘోసాసుపత్రి, మూగ చెవిటి వారి కోసం GGH, ఘోషాసుపత్రిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.