News June 7, 2024
VZM: వైసీపీ కార్యకర్తలకు అండగా పదిమందితో కమిటీ
YCP కార్యకర్తలపై దాడులు జరిగితే వారికి అండగా ఉండేందుకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను పార్టీ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసింది. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి 10 మందితో కమిటీని నియమించింది. కమిటీలో బొత్స సత్యన్నారాయణ, సూర్యనారాయణ రాజు, బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాస్, తలే రాజేష్, శంబంగి అప్పలనాయుడు, అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాస్ ఉన్నారు.
Similar News
News December 10, 2024
విజయనగరంలో నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు
అలనాటి ప్రముఖ సినీ నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు విజయనగరంలో మంగళవారం పర్యటించారు. సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభ మూర్తి, కోడలు ఈశ్వరరాణి, తదితరులు గురజాడ అప్పారావు మ్యూజియాన్ని సందర్శించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ అప్పారావు ముని మనవడు గురజాడ ప్రసాద్ పాల్గొన్నారు.
News December 10, 2024
VZM: ‘ఆ కేసుల్లో రాజీ కుదర్చండి’
డిసెంబర్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎ అదాలత్‌లో పలు కేసుల్లో ఇరు వర్గాలకు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాజేశ్ కుమార్ సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల న్యాయమూర్తులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కు బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.
News December 10, 2024
విజయనగరం: పింఛన్ల అర్హతపై గ్రామాల్లో ముమ్మర సర్వే
జిల్లాలో అనర్హత గల వారు పింఛన్లు పొందుతున్న వారిపై గ్రామాల్లో సర్వే విస్తృతంగా జరుగుతోంది. సామాజిక పింఛన్లు తీసుకుంటున్న వారి ఇళ్లకు అధికారులు, సిబ్బంది వెళ్లి అర్హతలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన నియమావళితో ఇళ్లకు వెళ్లి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. వయస్సు, కరెంట్ బిల్లు, నాలుగు చక్రాల వాహనం, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం, ధ్రువీకరణ పత్రాలు, తదితర వాటిపై ఆరా తీస్తున్నారు.