News March 28, 2025

VZM: శుభలేఖ సుధాకర్, SP శైలజకు జీవిత సాఫల్య పురస్కారం

image

ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్, సినీ నేప‌థ్య గాయని ఎస్పీ శైలజకు కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నామని కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1 న ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళా పీఠం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని పద్మభూషణ్, గానకోకిల పి.సుశీల పాల్గొంటారన్నారు.

Similar News

News April 3, 2025

కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య: SI

image

రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన పతివాడ కొత్తయ్య (65) తన కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ప్రసాద్ వివరాల మేరకు.. కొత్తయ్య కుమారుడు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News April 3, 2025

VZM: రైలు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి

image

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన కానిస్టేబుల్ బొబ్బిలి రామకోటి(37) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. జామి మండలానికి చెందిన రామకోటి ప్రస్తుతం కొత్తవలస పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీన రామకోటి విశాఖ నుంచి విజయనగరం వస్తున్న సమయంలో కోరుకొండ- విజయనగరం రైల్వే స్టేషన్ మధ్య జొన్నవలస సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడటంతో మహారాజు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మరణించాడు.

News April 3, 2025

రామభద్రపురం: పొక్సో కేసులో నిందితుడికి మూడేళ్లు జైలుశిక్ష

image

పొక్సో కేసులో నిందితుడు కె.రమేశ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు మూర్తి కె.నాగమణి తీర్పు ఇచ్చినట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు చెప్పారు. ఆరికతోట గ్రామానికి చెందిన రమేశ్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక వేదింపులకు పాలప్పడినట్టు రామభద్రపురం పోలీస్ స్టేషన్లో 2021లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మూడేళ్లు జైలుశిక్ష, రూ.11వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.

error: Content is protected !!