News March 21, 2025
VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.
Similar News
News April 18, 2026
VZM: ‘బీఎల్ఏలను త్వరగా నియమించాలి’

రాజకీయ పార్టీలు ప్రతీ పోలింగ్ కేంద్రానికి తమ ప్రతినిధులుగా బీఎల్‌ఏలను నియమించి, ఆ జాబితాను త్వరగా అందజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు కోరారు. తమ ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. బీఎల్ఎలను నియమించుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందని అన్నారు.
News April 18, 2026
VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News April 18, 2026
VZM: మే 5, 6,7 తేదీల్లో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు

రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల (5వ ఏపీ కప్) పోస్టర్‌ను గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు శనివారం అశోక్ బంగ్లాలో ఆవిష్కరించారు. మే 5, 6,7 తేదీల్లో విజయనగరం రాజీవ్ స్టేడీయంలో ఈ పోటీలు జరగనున్నట్లు జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీ గ్రీష్మ పాల్గొన్నారు.


