News March 23, 2024
VZM: ‘సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గింపు’

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గిస్తామని జిల్లా ఐఎంఎల్ డిపో మేనేజర్ ఎన్ వి రమణ వెల్లడించారు. నెల్లిమర్ల ఐఎంఎల్ డిపోలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిపో పరిధిలో ఉన్న 279 మద్యం షాపులకు సంబంధించి గత ఏడాది కన్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సేల్స్ తగ్గిస్తామని చెప్పారు. డిపో పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించనున్నట్లు చెప్పారు.
Similar News
News February 25, 2026
రాజాంలో పద్మం సిల్వర్ జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్

పద్మం సిల్వర్ జువెలరీ బ్రాంచ్‌ను రాజాంలోని పాలకొండ రోడ్డులో గల CMRలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను టీడీపీ నాయకుడు కొండ్రు జగదీశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న ఆభరణాలతో పాటు అద్భుతమైన ఆఫర్లను పెట్టారు. సిల్వర్ జువెలరీకి కూడా మార్కెంట్‌లో డిమాండ్ పెరిగిందని CMR గ్రూపుల అధినేత మావూరి వెంకట రమణ పేర్కొన్నారు.
News February 25, 2026
విజయనగరం RDO, బొబ్బిలి DSP బదిలీ

2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీవోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇవాళ కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం RDO దాట్ల కీర్తి కూడా ఉన్నారు. అదే విధంగా బొబ్బిలి DSP భవ్య రెడ్డిని కూడా బదిలీ చేశారు.
News February 25, 2026
VZM: ‘వైద్యరంగంలో పరిశోధనలు పెరగాలి’

వైద్యరంగంలో పరిశోధనలను పెంచాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. పరిశోధనలకు రూ.50 లక్షలు, క్రీడా కార్యకలాపాలకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ-జర్నల్స్ సభ్యత్వం తీసుకోవాలని, ప్రతి మూడు నెలలకు పురోగతి నివేదికలు సమర్పించాలన్నారు.


