News July 18, 2024
VZM: సింహచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహచలం గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20,21 తేదీలలో జరుగుతున్న గిరిప్రదక్షిణకు హాజరవుతున్న ప్రయాణికులకు APSRTC విజయనగరం డిపో నుంచి సింహచలం వరకు 40 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.
Similar News
News October 14, 2025
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
News October 13, 2025
VZM: ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న కౌన్సిలింగ్

ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలలో 91 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 16న ఉ.11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ దేవి మాధవి సోమవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ జాబితాలు http://vizianagaram.nic.in, అందుబాటులో ఉన్నాయన్నారు.
News October 13, 2025
విజయనగరం పోలీసు వెల్ఫేర్ స్కూల్లో టీచర్ ఉద్యోగాలు: SP

పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ను బోధించేందుకు డీఈడీ/బీఈడీ అర్హత గల వారు కావాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 16న ఉ.10 గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీసు క్వార్టర్స్లో ఉన్న పోలీసు వెల్ఫేర్ పాఠశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.