News June 12, 2024
VZM: సీనియర్లకు దక్కని మంత్రి పదవి

ఉమ్మడి విజయనగరం జిల్లాకు <<13424145>>రెండు మంత్రి పదవులు<<>> దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆశావాహులుగా ఉన్న సీనియర్ నాయకులు కళా వెంకట్రావు, కోళ్ల లలితకుమారితో పాటు, రాజకీయ వారసులు బేబినాయన, అధితి గజపతిరాజుకు నిరాశే ఎదురైంది. ఇటు కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచిన లోకం మాధవిది కూడా ఇదే పరిస్థితి.
Similar News
News October 21, 2025
VZM: పండగ పేరిట పన్ను దోపిడీ?

విజయనగరం జిల్లాలో రెగ్యులర్ టాక్స్ పేయర్స్ అయిన పలువురు బాణసంచా వ్యాపారులు రికార్డుల్లో రూ.కోటి రిటర్న్ మాత్రమే చూపించి, రూ.4 కోట్ల టర్నోవర్‌ను దాచిపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. లావాదేవీలు, అండర్-ఇన్వాయిసింగ్ ద్వారా GST స్వాహా చేస్తున్నారన్నారు. గోదాముల్లోని క్లోజింగ్ స్టాక్‌లో లక్షల విలువైన సరుకు లెక్కల్లో చూపడం లేదని, బోగస్ ITC క్లెయిమ్‌లు, E-Way బిల్ ఎగవేతలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
News October 21, 2025
నీటి సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి: డ్వామా పీడీ

నీటి సంరక్షణ, నిల్వ చేసే పనులకు ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని డ్వామా పీడీ శారద దేవి కోరారు. ఉపాధి హామీ పనులపై స్థానిక డిఆర్డిఏ సమావేశ మందిరంలో మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. 2026- 27 పనుల ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపు, గుర్తింపు, పనుల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏపీడీలు, ఏపీవోలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.
News October 21, 2025
VZM: ‘పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకోవాలి’

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న స్మృతి వనంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, ఎస్పీ దామోదర్ పాల్గొని అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.