News June 12, 2024

VZM: సీనియర్లకు దక్కని మంత్రి పదవి

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు <<13424145>>రెండు మంత్రి పదవులు<<>> దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆశావాహులుగా ఉన్న సీనియర్‌ నాయకులు కళా వెంకట్రావు, కోళ్ల లలితకుమారితో పాటు, రాజకీయ వారసులు బేబినాయన, అధితి గజపతిరాజుకు నిరాశే ఎదురైంది. ఇటు కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచిన లోకం మాధవిది కూడా ఇదే పరిస్థితి.

Similar News

News March 25, 2025

నెల్లిమర్ల: నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ తెలిపారు. నెల్లిమర్ల MIMSలో నర్సింగ్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ అనంతరం జర్మనీలో రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

News March 25, 2025

బొబ్బిలిలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి 

image

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్‌గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

News March 25, 2025

విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. వారికి తీపి జ్ఞాపకం

image

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ 30 మంది అనాథ‌ చిన్నారులకు చూసే అవ‌కాశం క‌ల్పించింది. సొంత నిధుల‌తో 30 టికెట్స్ కొని వైజాగ్‌లోని పాపా హోమ్ అనాథ శ‌ర‌ణాల‌యానికి అంద‌జేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి వెళ్లారు.

error: Content is protected !!