News August 31, 2024

VZM: సెప్టెంబర్ 7న మద్యం దుకాణాలు బంద్

image

ప్రైవేటు మద్యం దుకాణాలను అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న 18వేల మంది సేల్స్మెన్, సూపర్వైజర్లు తమ ఉద్యోగాలకు ముప్పు కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వచ్చే నెల సెప్టెంబరు 7న ప్రభుత్వ మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు.

Similar News

News September 17, 2024

నెల్లిమర్ల జనసేనలోకి నేడు భారీగా చేరికలు

image

నెల్లిమర్ల లో వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మంగళవారం భారీగా చేరికలు జరగనున్నాయి. వైసీపీ కీలక నేత చనమళ్లు వెంకటరమణ తో సహా ఇద్దరు కౌన్సిలర్లు, పలు గ్రామాలకు చెందిన సర్పంచ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. సుమారు 5 వేల మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లోకం మాధవి హాజరుకానున్నారు.

News September 16, 2024

విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే

image

విశాఖ నుంచి దుర్గ్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.

News September 16, 2024

సాలూరు వస్తుండగా బైక్ దగ్ధం

image

ఆనందపురం ఫ్లైఓవర్ వంతెన వద్ద సోమవారం పల్సర్ బైక్ దగ్ధం అయింది. నవీన్ అనే యువకుడు విశాఖ నుంచి సాలూరు బైక్‌పై వెళుతుండగా ఫ్లైఓవర్ వంతెన వద్ద ఆకస్మికంగా బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన నవీన్ బైక్ నిలిపివేశాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.