News December 10, 2024

VZM: సౌద్ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగాలు

image

APSSDC ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు https://forms.gle/Xoy8SHAdaZCtugb1A లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి సౌద్ అరేబియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. >Share it

Similar News

News September 16, 2025

VZM: ప్రత్యేక అలంకరణలో పైడిమాంబ

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరించారు. మంగళవారం సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు చదురు గుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించి వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిమానోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభిల్లుతున్నారు.

News September 16, 2025

VZM: మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు వ‌రం

image

మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు స్వ‌స్త్ నారీ స‌శ‌క్తి ప‌రివార్ అభియాన్ ప‌థ‌కం ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వన్ అన్నారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి గోడ ప‌త్రిక‌ను ఆయ‌న క‌లెక్ట‌రేట్లో సోమ‌వారం ఆవిష్క‌రించారు. దీని ద్వారా వివిధ ర‌కాల స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన‌వారికి త‌గిన వైద్య స‌దుపాయాన్ని అందించాల‌ని సూచించారు.

News September 15, 2025

విజయనగరం ఎస్పీ కార్యాలయానికి 32 ఫిర్యాదులు

image

ఫిర్యాదు చేసిన బాధితుల సమస్యలను పోలీసు అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్య లత అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి 7 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.