News April 16, 2025

VZM: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు

image

విజయనగరం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రైమరీ లెవెల్ SGTలు 45, సెకండరీ లెవెల్ స్కూల్ అసిస్టెంట్లు 115 కాగా గతంలోనే 49 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 66 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.

Similar News

News December 19, 2025

పార్వతీపురం: ‘సత్ప్రవర్తనతో ఖైదీలు తమ శిక్షను పూర్తి చేయాలి’

image

సత్ప్రవర్తనతో ఖైదీలు తమ శిక్షను పూర్తి చేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పార్వతీపురం సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించి జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

News December 19, 2025

వరంగల్: రిలయన్స్ స్మార్ట్‌పై కేసు నమోదు

image

వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోగల రిలయన్స్ స్మార్ట్‌పై కేసు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రలాజికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ తెలిపారు. జడల శ్యామ్ అనే వినియోగదారుడికి మాయిశ్చరైజర్ క్రీంను ఎమ్మార్పీ ధర రూ.131 ఉండగా రూ.141లకు విక్రయించారు. అతను తగిన ఆధారాలతో తమకు ఫిర్యాదు చేయగా రిలయన్స్ స్మార్ట్‌లో తనిఖీలు చేసి అధిక ధరకు అమ్మినట్లు నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News December 19, 2025

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా పర్యటన

image

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్ యాదవ్ రెండు రోజుల జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన ఈనెల 20వ తేదీ రాత్రి 9 గంటలకు అన్నవరం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ అన్నవరం నుంచి కాకినాడ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు అన్నవరంలో బయల్దేరి కాకినాడ విచ్చేస్తారు. కాకినాడలో జరిగే వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ, పల్స్ పొలియోలో పాల్గొంటారని జిల్లా సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.