News April 16, 2025
VZM: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు

విజయనగరం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రైమరీ లెవెల్ SGTలు 45, సెకండరీ లెవెల్ స్కూల్ అసిస్టెంట్లు 115 కాగా గతంలోనే 49 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 66 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.
Similar News
News April 23, 2025
KMR: ఈ కాలేజీలో ఒక్కరు కూడా పాస్ కాలేదు

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్‌లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో మొత్తం 53 మంది విద్యార్థులు ఉండగా ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం గమనార్హం. కళాశాలలో అధ్యాపకులు లేకపోవడం, విద్య బోధన చేకపోవడంతో విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
News April 23, 2025
మెదక్: OU పరిధిలో బీ ఫార్మసీ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..
News April 23, 2025
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్‌కు చెందిన గాజంగుల రాజు 3వ సారి ఎన్నికయ్యారు. HYDలో మంగళవారం జరిగిన సంఘం మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గాజంగుల రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కీర్తి రమణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దీంతో సంఘం నాయకులు వారి అభినందించారు.