News March 24, 2025
VZM: స్వర్ణంతో సత్తా చాటిన లలిత

ఢీల్లీ వేదికగా జరగుతున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సత్తా చాటింది. ఆదివారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది. ఇప్పటికే ఆమె శనివారం జరిగిన 400 మీటర్ల పరుగలో రజతం కైవసం చేసుకుందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. పరుగులో రాణిస్తున్న లలితను పలువురు అభినందించారు.
Similar News
News November 2, 2025
విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.
News November 2, 2025
VZM: బస్సు చక్రాల కింద నలిగిన బతుకు

గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు(70) మృతి చెందాడు. మృతుడు తన స్వగ్రామం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించే సమయంలో బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. తల నుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.
News November 2, 2025
విజయనగరం నుంచి పంచారామాలకు

కార్తీక మాసం పురష్కరించుకుని పంచారామాలు భక్తులు దర్శించుకోవడానికి విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పంచా రామ పుణ్యక్షేత్రాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆదివారం రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరాయన్నారు. వచ్చే వారం వెళ్లాలనుకునేవారు సిబ్బందిని సంప్రదించాలని కోరారు.


