News February 12, 2025
VZM: హత్యకు గురైన MRO భార్యకు ప్రభుత్వ ఉద్యోగం

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.
Similar News
News March 28, 2025
VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 28, 2025
విజయనగరం: ఉప ఎన్నికల్లో YCP క్లీన్ స్వీప్

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. భోగాపురం వైస్ ఎంపీపీగా పచ్చిపాల నాగలక్ష్మి (వైసీపీ) ఎన్నిక కాగా, వివిధ మండలాల్లో మరో పది స్థానాల్లో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంతకవిటి మండలంలోని మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీకి చెందిన షేక్ హయ్యద్ బీబీ ఎన్నికయ్యారు.
News March 28, 2025
విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం

విజయనగరం రూరల్ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడన్నారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.